AP: ఈసారి టీడీపీ నిర్వహించే మహానాడును విజయవంతం చేద్దామని పార్టీ శ్రేణులకు హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును సక్సెస్ చేయాలన్నారు. ఈనెల 27, 28 తేదీల్లో హైబ్రిడ్ పద్ధతిలో పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించే మహానాడు కల్యాణ మండపాలు, స్థలాలను సందర్శించారు. అలాగే, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం, కోటవురట్ల మండలాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.
Tags :