స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వరుస ప్రాజెక్టులకు బిజీగా మారారు. ప్రస్తుతం దుల్కర్, పూజా హెగ్డే కాంబినేషన్లో ‘DQ41’ వర్కింగ్ టైటిల్‌తో పాన్-ఇండియా లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. ఈ మూవీ భారీ షెడ్యూల్ సక్సెస్ ఫుల్‌గా పూర్తైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ SLV సినిమాస్ తెలిపింది. ఈ మూవీకి రవి నేలకుదిటి దర్శకత్వం వహిస్తుండగా, జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు.