KMM: ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో నవ శకం మరియు లక్ష్మి క్లినిక్, సంయుక్త ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఆదివారం జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ విజయ్ దేవా వర్మ ప్రారంభించారు. గ్రామ శివారు ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.