WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని వడ్డేపల్లి శ్యామల దుర్గాదాస్ కాలనీలో అరుదైన “మే పుష్పం” వికసించి స్థానికులను ఆకట్టుకుంది. ప్రకృతి ప్రేమికులు నల్లాని వసుధ–శ్రీనివాస్ ఇంటి ఆవరణలో పూసిన ఈ పుష్పాన్ని ఫుట్బాల్ లిల్లీ, బ్లడ్ లిల్లీ అని కూడా పిలుస్తారు. సంవత్సరానికి ఒక్కసారే వికసించే ఈ పువ్వు ఎండాకాలంలో ప్రత్యేకంగా పూయడంతో కాలనీవాసులు ఆసక్తిగా వీక్షించారు.