TG: ప్రభుత్వ అలసత్వం వల్లే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటా వృథా అవుతుందని BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు CM రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ట్రిబ్యునల్ కేటాయించిన 968 TMCల నికర జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కేంద్రం అనుమతులిచ్చిన కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల వందల టీఎంసీల నీటిని కోల్పోతున్నామన్నారు.