WGL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని WGL జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మహిళా సాధికారత, ఆరోగ్యం, విద్య, ఉపాధి, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని తెలిపారు.