వికారాబాద్ మండలం కొటాలగూడ గ్రామానికి చెందిన కురుమ మల్లేశం తన 20 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.