MDK: రామాయంపేట మండలంలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఆదివారం ఉదయం నుంచే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవడంతో రహదారులు ఖాళీగా మారాయి. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు బయటకు రావడం తగ్గించారు. చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.