W.G: నరసాపురం రెల్లిపేట నివాస ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.