NLG: చిట్యాల మండలంలోని ఉరుమడ్ల, గుండ్రాంపల్లి, సుంకనపల్లి, పెద్దకాపర్తి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. లారీలను, హమాలీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. గడువులోగా కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయనతో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఉన్నారు.