MDK: కొల్చారం రైతులు గత 20 రోజులుగా లారీలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, తరలింపు లేక రైతులు నష్టపోతున్నారని మీడియాకు తెలిపారు. వెంటనే లారీలు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.