కోనసీమ: ఎస్పీ రాహుల్ మీనా సూచనల మేరకు పోలీసులు దొంగతనాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమలాపురం పట్టణం మెయిన్ రోడ్లో ఉన్న ఓ షాపింగ్ మాల్లో ఆదివారం పట్టణ సీఐ వీరబాబు ఆధ్వర్యంలో మహిళలు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. సీఐ మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.