KRNL: కర్నూలు మూడో పట్టణ సీఐ శేషయ్యపై కొంతమంది అభ్యంతరకరంగా మాట్లాడిన వీడియోలు తన దృష్టికి వచ్చాయని ఆదివారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎస్.జవహర్ తెలిపారు. ఈ వీడియోల ఆధారంగా విచారణ చేపట్టి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. సీఐ కులాన్ని ఉద్దేశించి మాట్లాడటంపై చర్యలు తీసుకోవాలన్నారు.