W.G: తణుకులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. తణుకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సిమ్మెంటు బల్లపై సుమారు 58 ఏళ్లు వయసు కలిగిన వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కోర్టు పక్కన మార్కెట్ వద్ద పని చేసే వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. వడ దెబ్బ కారణంగానే మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.