IPLలో మ్యాచుకు ముందు సహచర ఆటగాళ్లతో మీటింగ్ పెట్టి వారిని ఒత్తిడికి గురి చేయనని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. కీలక మ్యాచుల్లో జట్టు సభ్యులకు స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని కల్పిస్తానని, వారు అతిగా ఆలోచించే అవకాశం కల్పించనని తెలిపాడు. పరాజయాలకు కుంగిపోకుండా జట్టులో సభ్యులను ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ.. సానుకూల విజయాలను సాధిస్తున్నట్లు చెప్పాడు.