MDK: రామాయంపేట మండల పరిధిలోని పలు రైస్ మిల్లులను శనివారం తహసీల్దార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవానీ ఇండస్ట్రీస్, లక్ష్మి ఇండస్ట్రీస్, శ్రీరామ రా రైస్ మిల్, మహేశ్వరి రైస్ మిల్, రాములు రా రైస్ మిల్లను ఆమె పరిశీలించారు. లారీల అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏలాంటి ఆలస్యం లేకుండా వెంటనే ట్రక్కులను ఖాళీ చేయించాలని మిల్లుల యజమానులను తహసీల్దార్ ఆదేశించారు.