BDK: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే కొద్ది గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ వర్షాల సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు ఇవాళ తెలిపారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు.