TG: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు మహిళా వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణ, షెడ్యూల్, ఏర్పాట్లపై ఆమె సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంట్ను సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా ప్రారంభిస్తామని చెప్పారు.