సత్యసాయి: ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీ రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదివారం బాధితుడి ఇంటికి వెళ్లారు. లక్ష్మీరెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని పేర్కొంటూ వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.