TG: గాంధీభవన్లో జరుగుతున్న హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రచ్చ జరిగింది. గోషామహాల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సునీత రావు రాకముందే సమావేశం ప్రారంభించడంపై ఆమె మద్దతుదారులు ఆందోళన చేశారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిని ప్రశ్నించారు. దీంతో మల్లు రవి కార్యకర్తల తీరుపై మండిపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే చెప్పాలని.. కానీ అరవద్దని అసహనం వ్యక్తం చేశారు.