VKB: మహాత్మా బసవేశ్వరుడు చూపిన మార్గం ఎంతో ఆదర్శనీయమని, ఆయన ఆశయాలను ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని వీరశైవ సమాజం సభ్యులు దయానంద స్వామి అన్నారు. ఆదివారం VKBలోని బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో బసవేశ్వరుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి బసవరాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణానికి, కులనిర్మూలనకు బసవేశ్వరుడు ఎంతో కృషి చేశారని కొనియాడారు.