KMM: సత్తుపల్లికి చెందిన ఆర్ఫజ్ అలీ అనే విద్యార్ధి తెలంగాణ పాలీసెట్ ఎంట్రన్స్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. కాగా ఆదివారం సత్తుపల్లిలో విద్యార్ధి ఆర్ఫజ్ అలీను ఎమ్మెల్యే మట్ట రాగమయి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. చదువును మించిన ఆస్తి ప్రపంచంలోనే లేదన్నారు.