AP: శ్రీశైలం సున్నిపెంట జెన్కో కాలనీలో చిరుత సంచారం కలకలం రేపింది. ఉదయం 4 గంటలకు ఓ ఇంటి ముందుకొచ్చిన చిరుత.. కోళ్ల కోసం ఏర్పాటు చేసిన ఇనుప బాక్సులో ఉన్న ఓ కోడిని ఎత్తుకెళ్లేందుకు యత్నించి విఫలమై వెనుదిరిగింది. ఇంటి సభ్యులు సెల్ఫోన్లో వీడియో తీసి SMలో పోస్టు చేశారు. అటవీశాఖ అధికారులు స్పందించి, చిరుత నుంచి తమను రక్షించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.