టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నెల్లూరుకు చెందిన ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్, డబ్బింగ్ చిత్రాల నిర్మాత G.హరి(47) ఇవాళ ఉదయం HYDలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన 20 ఏళ్లుగా వైజయంతి మూవీస్, SV క్రియేషన్స్ సహా పలు నిర్మాణ సంస్థలు రూపొందించిన వందలాది చిత్రాలను NLR ప్రాంతంలో పంపిణీ చేశారు. డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషించారు.