NDL: జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదివారం CPI జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు డిమాండ్ చేశారు. ప్రస్తుతం రూ.18,892 జీతంలో ఉద్యోగుల ఖాతాల్లో కేవలం రూ.13,392 మాత్రమే జమవుతోందని, GST, మెయింటెనెన్స్ పేరుతో కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. SC తీర్పు మేరకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలన్నారు.