SRD: కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో చెరువు ఆనకట్ట దగ్గర కొన్ని రోజుల క్రితం మరకత శివలింగాన్ని ప్రతిష్టించారు. అయితే రోజువారిగా ఆలయ కమిటీ సభ్యులు పూజ నిమిత్తం ఆలయం దగ్గరికి వెళ్లారు. ఆలయ శిఖరంపైన సూర్య కిరణాలు ఒక వృత్తాకారాలయంలో కనిపించడంతో భక్తులందరూ ‘ఓం నమఃశివాయ’ అంటూ ఫోన్లలో చిత్రాలు దించుకున్నారు.