ఖమ్మం జిల్లాలో పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగుల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తైంది. ఉపాధ్యాయులు, పోలీస్ శాఖలను మినహాయించి 35కిపైగా విభాగాల్లో ఈ ప్రక్రియ నిర్వహించారు. ప్రాధాన్య కేటగిరీల ఆధారంగా అధికారులు కౌన్సెలింగ్ చేపట్టగా, త్వరలోనే బదిలీ ఉత్తర్వులు జారీ కానున్నాయి. జూన్ 1 నుంచి ఉద్యోగులు కొత్త స్థానాల్లో విధులు చేపట్టనున్నారు.