KMR: సదాశివనగర్ మండలం లక్ష్మీనాయక్ తండాలో ఆదివారం వాలీబాల్ టోర్నమెంట్ను తాండ నాయకులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. క్రీడలు శారీరిక మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అన్నారు. ముఖ్యంగా క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి అలవర్చుకోవాలని క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. యువతకు క్రీడలు అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.