NZB: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని సుమారు 65 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులపై ఆర్థిక భారం తీరనుంది.