TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు నాలుగో రోజుకు చేరాయి. పుష్కరాలకు భక్తులు భారీగా తరలొస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఘాట్ల వద్ద చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. తాగునీటి కేంద్రాలు, మొబైల్ టాయిలెట్లు, పారిశుధ్య సిబ్బంది, వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచారు.