WNP: వీధి వ్యాపారులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గోపాలకృష్ణ కోరారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ రోడ్లపై వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుత అడ్డాల్లోని వ్యాపారాలు చేసుకునేలా అనుమతించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.