కరీంనగర్: జిల్లాలో కేంద్ర పారామిలటరీ బలగాల గ్రూప్ సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లేఖపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రుక్మాపూర్, వెల్ది, గన్నేరువరం ప్రాంతాల్లో మొత్తం 14 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది.