శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో రవిబాబు ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 3,124 మంది విద్యార్థులు పరీక్షలు రాయినున్నట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.