GNTR: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. టెన్త్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు మెమోంటోలను అందజేసి మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని పేర్కొన్నారు.