WNP: గోపాల్ పేట మండలం బుద్ధారం వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 72 ఎద్దులను పట్టుకున్నారు. బక్రీద్ కోసం అనంతపూర్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న కంటైనర్ను పోలీసులు అడ్డుకున్నారు. డ్రైవర్ వసీం అక్రమ్ పరారయ్యాడు. క్లీనర్లు కైఫ్ ముహమ్మద్, అబ్దుల్ నవాజ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎద్దులను రాజానగరం గోశాలలో ఉంచారు.