మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మూసాపేట మండలం జానంపేటలో అత్యధికంగా 20.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూత్పూర్లో 14.8, అడ్డాకులలో 14.3, బాలానగర్లో 13.8, జడ్చర్లలో 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది.