ప్రకాశం: గిద్దలూరులో బ్రాయిలర్ చికెన్ ధరలు ఆదివారం అనూహ్యంగా పడిపోయాయి. ఇటీవల కొండెక్కిన ధరలు కేజీ రూ.180కి చేరాయి. కోళ్ల ఉత్పత్తి పెరగడమే దీనికి కారణమని విక్రయదారులు తెలిపారు. మటన్ ధర రూ.900 వద్ద స్థిరంగా ఉండగా, చికెన్ ధరల పతనం మాంసాహార ప్రియులకు శుభవార్తగా మారింది. ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.