BDK: కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు మణుగూరు మండలం కమలాపురం గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనే మాట్లాడారు.