HNK: సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరం మార్గంలో ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం పడుతోంది. హన్మకొండ నుంచి పరకాల, రేగొండ, భూపాలపల్లి మార్గాల్లో నడిచే బస్సుల్లో సాధారణ ఛార్జీలకు మించి వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గతంలో పరకాల వరకు రూ. 60 తీసుకున్న చోట ప్రస్తుతం రూ. 80 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు.