మహబూబ్నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నవాబుపేటలో 40.9, చిన్నచింతకుంటలో 40.8, బాలానగర్, పారుపల్లిలో 40.6 డిగ్రీలు నమోదయ్యాయి. మహబూబ్నగర్ అర్బన్, భూత్పూర్, జడ్చర్ల, దేవరకద్ర ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.