BHPL: సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే నదీ తీరాన పుష్కర వత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు.