KKD: జగ్గంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ఇకపై డ్రంకెన్ డ్రైవ్ తరహాలో డ్రగ్ డిటెక్షన్ తనిఖీలు నిర్వహించనున్నట్లు సీఐ బి. తిరుపతిరావు తెలిపారు. SP బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక టెస్టింగ్ కిట్స్‌తో ఈ సోదాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ వినియోగం, సరఫరాపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమాచారం కోసం 112, 1972 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలన్నారు.