CTR: బక్రీద్ సందర్భంగా చిత్తూరు జిల్లాలో పొట్టేళ్ల విక్రయాలు ఊపందుకున్నాయి. బైరెడ్డిపల్లి శనివారం సంతలో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. రూ. కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కో పొట్టేల్ రూ.10వేల నుంచి రూ.1.20లక్షల వరకు విక్రయించారు. బక్రీద్ కోసమే కొందరు ఏడాదిగా పొట్టేళ్లను పెంచుతున్నారు.