ATP: గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలోని 44 హైవే పై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారు టైరు పేలి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుల్బర్గా నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.