కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సి. హెచ్. భావన శనివారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డు కార్యదర్శులు, నగరపాలక అధికారులు, అన్ని శాఖల విభాగాధిపతులు పాల్గొన్నారు. ప్రజలకు అందిస్తున్న సేవల్లో మరింత మెరుగుదల తీసుకురావాలని, ప్రతి అధికారి తమ బాధ్యతలను క్రమశిక్షణతో, సమర్థవంతంగా నిర్వర్తించాలని కమిషనర్ ఆదేశించారు.