SKLM: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పనితీరును చూసి గర్వించాలని రామ్మోహన్ తల్లి విజయ కుమారితో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబసమేతంగా ప్రధానిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. చిన్న వయసులో కేంద్ర మంత్రిగా రామ్మోహన్ బాధ్యతలు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారని కొనియాడారు.