NLR: యువత గంజాయి బారిన పడకుండా నిర్మూలించడానికి ముందడుగు వేయాలని సీఐ శ్రీనివాసరావు అన్నారు. బుచ్చి మండలం కాగులపాడులోని నెహ్రూ కాలనీలో ఎస్సై సంతోష్ రెడ్డి కలిసి కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి, వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 33 వాహనాలను సీజ్ చేశారు. స్థానిక ప్రజలకు నేర నియంత్రణపై అవగాహన కల్పించారు.