WNP: ఘనప సముద్రం రిజర్వాయర్ నిర్మాణం, గొల్లపల్లి, పోల్కేపహాడ్, కాశీం నగర్ రిజర్వాయర్ల విస్తరణపై ఎమ్మెల్యే మేఘారెడ్డి సమీక్షించారు. పెబ్బేరు మినీ ట్యాంక్ బండ్ అంశాలు, మామిడివాడ రిజర్వాయర్ విస్తృతి, భీమా 15 ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలన్నారు. తలుపునూరు గ్రామానికి చెందిన 2,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.