GNTR: మంగళగిరి మండలం నవులూరులో 70 ఏళ్ల అవ్వారు నాగేశ్వరరావు నిరాశ్రయ స్థితిలో కనిపించారు. తన పేరున ఉన్న ఆస్తులను సోదరులు, సోదరీమణులు రాయించుకుని ఇంటి నుంచి వెళ్లగొట్టారని వృద్ధుడు వాపోయాడు. ప్రస్తుతం బిక్షాటనతో జీవిస్తున్నానన్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకట్ ఆయనను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చి జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించారు.