ప్రకాశం: కంభం పట్టణంలోని తెలుగు వీధిలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తనిఖీలు చేపట్టి అనుమానిత వ్యక్తులు, వాహనాలను పరిశీలించారు.నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ సెర్చ్ నిర్వహించినట్లు సీఐ మల్లికార్జున తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే అందించాలని సూచించారు.